తాంసి, జూన్ 12 : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్ రెడ్డి, ఎంఈవో శ్రీకాంత్, ఆర్ఐ మహేందర్ పాల్గొన్నారు.
ఎదులాపురం, జూన్ 12 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మన ఊరు -మన బడి, మన బస్తి-మన బడి పథకాలతో పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక సౌకర్యాలు కల్పించి ఉన్నత విద్యకై ప్రోత్సహించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లోని ప్రైమరీ స్కూల్లో బడిబాట కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ ప్రకాశ్‌తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, డీఎస్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఐకేపీ సిబ్బంది భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, జూన్ 12 : పట్టణంలోని మహాలక్ష్మీవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. పాఠశాలకు వచ్చిన వారిని శాలువాతో సన్మానించారు. అంతకుముందు పదో తరగతిలో 9 జీఏపీ సాధించిన విద్యార్థులను ఎంపీ, ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, మున్సిపల్ కమిషనర్ ఖమర్అహ్మద్, ఎంఈవో జయశీల, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 12 : బోథ్‌లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎంపీపీ తుల శ్రీనివాస్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే బోథ్ తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఉమేశ్రావ్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్, మహేందర్ రెడ్డి, ఏపీఎం మాధవ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, అల్లకొండ ప్రశాంత్, వీవో అధ్యక్షురాలు శోభ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 12 : మండల వ్యాప్తంగా 77 పాఠశాలలుండగా అందులో 10 పాఠశాలలకు ఎంఈవో రాథోడ్ ఉయద్రావ్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మిగతా పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది, సీసీవో సురేశ్, సీఆర్పీ రవీందర్, శ్యాం సుందర్ పాల్గొన్నారు.
ఎదులాపురం, జూన్ 12 : ఆదిత్యనగర్కాలనీలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీలత, రిటైర్డ్ హెచ్ఎం శ్రీధర్, రంజిత్‌రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, జూన్ 12 : గుడిహత్నూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులకు యునిఫాం,పాఠ్య పుస్తకాలు అందజేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను మండల స్పెషల్ ఆఫీసర్ సునీత ప్రారంభించారు. అదనపు తరగతి గదులను ఎంఈవో నారాయణ ప్రారంభించారు. మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపిక కావడంతో వారిని పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు సన్మానించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, పాఠశాలల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 12: మండలంలోని లక్కారం ప్రభుత్వ పాఠశాలలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జూ పటేల్ విద్యార్థులకు పుస్తకాలు, యునిఫాంలు అందజేశారు. అదేవిధంగా శ్యాంపూర్ పాఠశాలలో వైస్ ఎంపీపీ దావులే బాలాజీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యునిఫాంలు అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, జడ్పీటీసీ చారులత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.
జైనథ్(బేల), జూన్ 12 : బేలలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కోల నర్సింహులు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. నూతనంగా అడ్మిషన్ పొందిన 35 మంది విద్యార్థులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ వనితా ఠాక్రే, మండల ప్రత్యేకాధికారి శంకర్, ఎంపీడీవో మహేందర్, మాజీ సర్పంచ్ ఇంద్రశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేవన్న, బీజేపీ మండలాధ్యక్షుడు దత్త నిక్కం పాల్గొన్నారు.
జైనథ్, జూన్ 12 : తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎంపీపీ ఎం గోవర్ధన్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు ఏకరూప దుస్తులు అధికారులు నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి, జైనథ్, దీపాయిగూడ ఎంపీటీసీలు సుదర్శన్, కరుణాకర్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సాంబశివ్రావ్, ఎంఈవో శ్రీనివాస్, ఎంపీడీవో రవీంద్రనాథ్, ప్రధానోపాధ్యాయులు లస్మన్న, రాములు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 12 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, నాయకులు ప్రభాకర్, సయ్యద్‌ఖాసీం, బాబాఖాన్, ఎంఈవో రాపెల్లి ఆశన్న పాల్గొన్నారు.
భీంపూర్, జూన్ 12 : అంతర్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన మూత్రశాలలు, ఫ్యాన్లు జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ఎంపీడీవో గోపాలకృష్టారెడ్డి, హెచ్ఎం శ్రీకాంత్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. బేల్సరిరాంపూర్లో ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, పిప్పల్‌కోటిలో వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న బడిబాటలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి కిషన్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, పాలెపు భూమన్న, వెంకటేశ్, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు నర్సయ్య, నితిన్, నాయకులు పాల్గొన్నారు.
భైంసా, జూన్ 12 : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పిప్రి కాలనీలో గల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రజాక్, కౌన్సిలర్ చందులాల్, గౌతం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, యువ నాయకుడు దత్తాత్రి, ఎంఈవో సుభాష్, పీఆర్టీయూ నాయకులు రమణారావు, గజ్జారాం, నాయకులు భీంరావ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 12 : నిర్మల్‌లోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సిద్ధ పద్మ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ, పరమేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దస్తురాబాద్,జూన్12 : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం కోట వేణు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమేశ్,కాంప్లేక్స్ హెచ్ఎం టీ గంగాధర్ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వేణు, పాఠశాల చైర్మన్ శీరిషా,కమిటీ సభ్యులు, ఏపీఎం గంగాధర్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కుంటాల, జూన్ 12 : కుంటాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీ అప్క గజ్జారాం విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రహీం, ప్రధానోపాధ్యాయుడు గజేందర్ పాల్గొన్నారు.