నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి
ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీలో పన్నుల వసూలు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.
- పన్నుల వసూలు వేగవంతం చేయాలి
- అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 17: ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీలో పన్నుల వసూలు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలతో లక్ష్యాల సాధన ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉండి అర్హత గల ప్రతి కూలీకి పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్ల నిర్మాణాలు, కమ్యూనిటీ ఆస్తుల ఏర్పాటు, నర్సరీల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.
గ్రామపంచాయతీల పరిధిలో మార్చి 31వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీల కార్యదర్శులు పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆ దిశగా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కుమార్ హుస్సేన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

