ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జనవరి 3 : వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. రిజిష్టర్లతో పాటు వంటశాల, తరగతి గదులు, నిత్యావసరాల నాణ్యతను పరిశీలించారు.
సబ్జెక్టుల వారీగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ఆయన మాట్లాడుతూ గడువులోగా సిలబస్ పూర్తి చేసి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలని, నూతన మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.