ఇచ్చోడ, జూన్ 27 : మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణానికి సరిపడా బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జీరో టికెట్ మీద ప్రయాణించే అతివలు కనీసం నిల్చొనే చోటు లేక ఇకట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్రయాణం చేస్తున్న పురుషుల సంగతి సరేసరి. ఈ తరుణంలో ఆర్టీసీ యాజమాన్యం అంతర్గతంగా జారీ చేసిన ఆదేశాలతో స్థానిక అధికారులు పెంచిన చార్జీలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు కొందరు పురుష ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలని పురుషులు.. తమ పాస్‌ల ధరలను తగ్గించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే నె లవారీ రూట్ పాస్ చార్జీలను ఆర్టీ సీ పెంచింది. 20 రోజుల చార్జీతో నెలరోజులపాటు ప్రయా ణం చేయడానికి అందిం చే సీజన్ పాసుల పై రూ. 400 అదనంగా వసూ లు చేయనున్నారు. ఇక 12 ఏండ్లు నిండిన బా లురకు పల్లె వెలుగు బ స్సుల్లో అందించే రాయి తీ బస్‌పాస్ ధరలను అమాంతం పెంచారు. ఐదు కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల మధ్య విద్యార్థి ఇంటి నుంచి విద్యాసంస్థ వరకు ప్రయాణం చేస్తారు. దీనికి రూ.150 నుంచి మొదలయ్యే పాస్ ధర కనిష్ఠంగా నెలకు రూ.75 నుంచి గరిష్ఠంగా రూ.275 వరకు ఉంది.
ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సుల టికెట్ ధరలు కిలోమీటర్ల రౌండ్ ఫిగర్‌తో నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఎక్స్‌ప్రెస్ సర్వీసులో మాత్రం సరిగ్గా కిలోమీటర్‌కు లెకించి టికెట్ ధర నిర్ణయిస్తారు. అయితే గతంలో చిల్లర సమస్య పేరిట టికెట్ ధరలను రౌండప్ పేరిట పెంచారు. తాజాగా మరోసారి కిలో మీటర్లను సర్దు బాటు చేస్తున్నామనే పేరిట రూ.10 పెంచేశారు. జిల్లా మార్గాల్లో, ఐదు కిలో మీటర్ల వరకు నెలవారీ పాస్ ధరను రూ.150 నుంచి రూ.225కి పెంచారు. 10 కిలో మీటర్ల పాస్ ధరను రూ. 250 నుంచి రూ.375కి(రూ.125 పెంపు) పెంచారు. 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల పాస్‌లకు వరుసగా రూ.150, రూ.200 పెరిగాయి.
అయితే 25 కిలో మీట ర్లు, 30 కిలో మీటర్లు, 35 కిలో మీటర్ల పాస్‌లకు వరుసగా రూ.225, రూ.250, రూ. 275 పెరిగాయి. జనరల్ బస్సు టికెట్లను కూడా సవరించారు. హైదరాబాద్, వరంగల్‌లో స్టూడెంట్ జనరల్ బస్‌టికెట్(ఎస్‌జీబీటీ) ధరను రూ.400 నుంచి రూ.600కి(రూ.200 పెంపు) పెంచారు. జీబీటీ (జనరల్ బస్ టికెట్) కేటగిరీ కింద నెలవారీ పాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఆర్డినరీ పాస్ ధర ఇప్పుడు రూ.1,450కు పెరిగింది. ఇది రూ.1,150 (రూ.300 పెంపు), మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధర రూ.1,300 నుంచి రూ.1,600 (రూ.300 పెంపు)కు పెరిగింది.
మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1,450 నుంచి రూ.1,800 (రూ.350 పెంపు)కు పెరిగింది. ఈ ధరల పెరుగుదలపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉద్యోగులు, దినసరి కూలీలు, తకువ ఆదాయ వర్గాల ప్రజలు రోజువారీ ప్రయాణానికి ఈ బస్‌పాసులను ఉపయోగిస్తారు. పెంచిన ధరలు వారి నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోపాటు బస్‌పాస్ ధరలు తమ జీవితాన్ని కష్టతరం చేస్తుందని అంటున్నారు.