నిర్మల్ చైన్‌గేట్, జూన్ 11 : కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరి ప్రక్రియ ఆలస్యం చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం అధికారులు, రైస్‌మిల్లర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లులవారీగా కేటాయించిన ధాన్యం ఇప్పటివరకు అప్పగించిన బియ్యం వివరాలను తెలుసుకున్నారు. డెలివరి ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
రోజు డిప్యూటీ తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్సు ద్వారా డెలివరి పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, మేనేజర్ సుధాకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, తదితరులు పాల్గొన్నారు.