నిర్మల్ చైన్‌గేట్, జూన్ 8 : నిబంధనలు పాటించని ప్రైవేటు దవాఖానలపై వైద్యాధికా రులు చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 200లకు పైగా ఆసుపత్రులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వ హించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొన్ని రోజులుగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న దేవేందర్‌రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. 2010 నియమ నిబంధనల ప్రకారం ఆసుపత్రులను నిర్వహించాలని, అనుమతులు తీసుకోకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నిర్మల్ డీఎంహెచ్ఓ ధన్‌రాజ్ పేర్కొన్నారు.