చింతలమానేపల్లి, నవంబర్ 25 : చింతలమానేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం కలకలం రేపింది. సాయంత్రం అధికారులు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అయ్యింది. బెజ్జూర్ మండలానికి చెందిన వారికి 10 గుంటలు విరాసత్ చేసే విషయమై ఇద్దరు కార్యాలయ సిబ్బంది సుమారు రూ.50 వేల లంచం డిమాండ్ చేయగా, వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారన్నది దాని సారాంశం.
సిబ్బంది తృటిలో తప్పించుకున్నారన్న వార్తలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై తహసీల్దార్ వెంకటేశ్వర్‌ను ఫోన్లో సంప్రదించగా.. అలాంటిదేదీ తన దృష్టికి రాలేదని తెలిపారు. సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతున్నట్లు తెలిసిందని వెల్లడించారు.