తాండూర్/బెల్లంపల్లి/కోటపల్లి/కాగజ్‌నగర్/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్/వాంకిడి/పెంచికల్పేట్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన డీఎస్సీ-2024 ఫలితాల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. తాండూర్ మండలం అచ్చలాపూర్‌కు చెందిన సత్యనారాయణ-పద్మ దంపతుల కుమారుడు ఏకారి ఆంజనేయులు 76.23 మార్కులతో జిల్లాలో ప్రథమ ర్యాంకు సాధించారు. భౌతికశాస్త్రం (స్కూల్ అసిస్టెంట్) విభాగంలో ఒ కే పోస్టు ఉండడం, మొదటి ర్యాంకు రావడంతో కుటుం బ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు ఆయనను అభినందించారు. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జోర్రీగల విజయ్ బయోలోజికల్ సైన్స్‌లో 85.87 మార్కులతో జిల్లాలో మూడో ర్యాంకు సాధించారు.
నర్సయ్య, సరోజనల చిన్న కుమారుడు విజయ్ స్థానికంగా పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. భువనగిరిలో బీఈడీ చదివారు. ఇప్పటికే టీజీటీ సైన్స్, టీజీటీ బయోలోజిలో ఉద్యోగాలు సాధించారు. తాండూర్ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో టీజీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓపెన్‌లో ఆరు పోస్టులుండగా, మూడో ర్యాంకు వచ్చింది. కోటపల్లి మండలం షట్పల్లికి చెందిన వే ముల శ్వేత మం చిర్యాల జిల్లా స్థాయిలో 23వ ర్యాంక్ సాధించారు. ఎస్జీటీ పేపర్-1లో 79.20 మార్కులు తెచ్చున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం అందెవెల్ల్లికి చెందిన శివరాం-సంతర్ బాయిల కుమార్తె శిరీష తెలుగు మీడియంలో 86.17 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు శిరీషను అభినందించారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడకు చెందిన అనుమండ్ల సంతోష్ జనరల్ ర్యాంకింగ్‌లో 12వ ర్యాంకు తెచ్చుకున్నారు. వాంకిడి మం డలానికి చెందిన కొబ్రాగడే అక్షయ్ జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు, గుంపుల గోపాల్ జిల్లా స్థాయిలో 11వ ర్యాంకు, చునారర్ భరత్ 27వ ర్యాంకు సాధించారు.
పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు అప్పాజీ గణేశ్ (స్కూల్ అసిస్టెంట్) సోషల్‌లో జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్, అప్పాజీ సతీశ్ (సూల్ అసిస్టెంట్) సోషల్‌లో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. అప్పాజీ గణేశ్ ప్రస్తుతం లోడ్పల్లిలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే నల్గొండ అనిల్‌కుమార్ జిల్లాలో ఎనిమిదో ర్యాంక్ (ఎస్జీటీ) సాధించారు. కొయ్యడ సాయికుమార్ జిల్లా స్థాయిలో 19వ ర్యాంక్ (ఎస్జీటీ)లో సాధించారు. ఈయన ఇప్పటికే సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చెడువాయికి చెందిన నందిపేట అశోక్ జిల్లా స్థాయిలో 23వ ర్యాంక్ (ఎస్జీటీ) సాధించారు. లోడ్పల్లి చెందిన కిశోర్ (ఎజ్జీటీ)లో 40వ ర్యాంకు సాధించారు. ఇక ఎల్లూరు గ్రామం నుంచి 8 మంది అర్హత సాధించారు.