బేల, జూలై 24 : భారీ వర్షాలతో చాలా చో ట్ల నష్టం వాటిల్లిందని, ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్ర భుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని పెన్‌గంగ పరీవాహక సాంగిడి , బెదోడ, మణియార్‌పూర్, కాంగార్పూర్, గూడ, కొగ్థూ ర్, మాంగ్రూడ్ తదితర గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. బాజీరావు బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం నింపారు. అక్కడే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో ఫోన్లో మాట్లాడి, నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ ప రంగా ఆదుకోవాలని కోరారు. అందుకు మం త్రి సానుకూలంగా స్పందించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్‌గంగ బ్యాక్ వాటర్‌తో చా లా చోట్ల రైతులు పంటలు నష్టపోయారని పే ర్కొన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, రైతు బం ధు సమితి జిల్లా అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠా క్రె, మండలాధ్యక్షుడు కల్యాం ప్రమోద్ రెడ్డి, అడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, తహసీల్దార్ సర్ఫరాజ్ నవాబ్, ఎంపీడీవో మ హేందర్ కుమార్, ఎంపీవో సమీర్హైమద్, నా యకులు మంగేశ్ ఠాక్రె, తన్వీర్‌ఖాన్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, మధూకర్, సంతోష్, సునీల్, వా డ్కర్ తేజ్‌రావు, వ్యవసాయ, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు ఉన్నారు.