నిర్మల్ టౌన్, మే 4 : రాష్ట్రంలో యాసంగి సీజన్లో మక్క పండించిన రైతాంగానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రారంభించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ ఏడా ది మక్క ధర రూ.1800లకు పడిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. క్వింటాల్‌కు రూ.1962 చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే మక్కను విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వరుణ్‌రెడ్డి,అదనపు కలెక్టర్ రాం బాబు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమ ణ, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, వైస్ చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, మార్కెటింగ్ అధికారులు అశ్వక్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికారులందరికీ కొత్త భవనాలు..
పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, కొత్త కలెక్టరేట్ భవనాలను నిర్మించడం పూర్తయిందని, అధికారులందరికీ సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల వద్ద రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించే అదనపు కలెక్టర్, ఇతర శాఖల రెసిడెన్షియల్ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎల్లపెల్లి శివారులో కొత్త కలెక్టరేట్ భవనం పూర్తయిందని, మంచిర్యాల రహదారి నుంచి కలెక్టరేట్ వరకు డబుల్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి-రాంకిషన్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, అధికారులు అశోక్‌కుమార్, జీవన్‌రెడ్డి, స్రవంతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో భరోసా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఏర్పడిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్మల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను అందించారు. మొత్తం 50 మందికి ఈ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నా యా? చూపించాలని ప్రజలు బీజేపీ నాయకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ప్రజల ఓట్ల కోసం కులమత రాజకీయాల విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలపై ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికీ ఒక సంక్షేమ పథకం వచ్చిందని, దాన్ని దృష్టిలో ఉం చుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ఎంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ ప్రభాకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రశాంతతకు నిలయాలు.. ఆలయాలు
నిర్మల్ అర్బన్, మే 4 : రాష్ట్రంలో ఆలయాలు ప్రశాంతతకు నిలయాలుగా మారాయని, కోట్లాది రూపాయల నిధులతో గుడులను సీఎం కేసీఆర్ అభివృద్ధి పరుస్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్త సాయి ఆలయంలో రూ.50 లక్షలతో సాయి ద్వారకా కల్యాణ మండపం, రూ.50 లక్షలతో ధ్యాన మందిరం, రూ.50 లక్షలతో ఫిలిగ్రి షెడ్లను ఒకేచోట నిర్మించగా, వాటిని సతీమణి విజయలక్ష్మితో కలిసి మంత్రి ప్రారంభించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చి న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు వేద పం డితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొ దట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గండిరామన్న ఆలయం, నందిగుండం దుర్గామాత ఆలయాలకు రూ.8 కోట్ల వరకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, జైపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేంధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, సాయి దీక్షా సేవా సమితి సభ్యులు పూదరి నరహరి, ఆమెడ శ్రీధర్, నందు, నందిగుండం ఆలయ వ్యవస్థాపకుడు కొండాజీ వెంకటాచారి, కౌన్సిలర్లు శ్రీకాం త్, అడ్ప విజయలక్ష్మి-పోశెట్టి, కో ఆప్షన్ సభ్యుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
మామడ, మే 4 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని ధన్జీ నాయక్ తండా నుంచి జాతీయ రహదారి 44 వరకు రూ.2.62కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆయన మట్లాడుతూ.. గిరిజన తండాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసిందన్నారు. మిషన్ భగీరథతో ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిచ్యానాయక్, ఎంపీటీసీ జాదవ్ చరణ్యజాలం, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు రాందాస్, భాస్కర్, సంతోష్, సీతారాం, రామారావు తదితరులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాల పెంపునకు కృషి చేయాలి
నిర్మల్ చైన్‌గేట్, మే 4: సాధారణ ప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఆపరేషన్ ప్రసవాలను తగ్గించాలని సూ చించారు.
రక్తహీనత రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించినట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టర్ వరుణ్‌రెడ్డి తలసేమియా నిర్మల్ ముక్త్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, జిల్లాసంక్షేమ అధికారి విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజేందర్, ఇద్రిస్ గౌరి, డాక్టర్ రజని, కార్యక్రమ నిర్వహణ అధికారులు రవీందర్‌రెడ్డి, రాజారమేశ్, నయనారెడ్డి, శ్రీనివాస్, నిఖిలారాణి, డిప్యూటీ జిల్లా విస్తరణ అధికారి రవీందర్, అధికారులు పాల్గొన్నారు.