తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ సచివాలయంలో గురువారం రాష్ట్ర అవతరణ ఉత్సవాల కార్యాచరణపై సీఎం అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
ఇందులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్‌రాజ్, వరుణ్ రెడ్డి, ఎస్పీలు ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఇంకా.. తొమ్మిదో విడుత హరిత హారం, పోడు భూములకు పట్టాల పంపిణీ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై కూడా దిశా నిర్దేశం చేశారు. – ఎదులాపురం/నిర్మల్ టౌన్, మే 25