బెల్లంపల్లి : బెల్లంపల్లి (Bellampalli) పట్టణంలోని కాలెక్స్ ఏరియాలో ఓ బార్లో జరిగిన గొడవలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై మహేందర్ తెలిపారు. తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీ బార్లో (Bar) మద్యం సేవించిన అనంతరం ఫుడ్ ఆర్డర్ (Food order) ఇవ్వగా ఆలస్యం కావడంతో ప్లేట్‌ను ఎత్తివేశాడు.
తమను చూసే ప్లేటును ఎత్తివేశాడని పక్క టేబుల్ వద్ద మద్యం సేవిస్తున్న పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అల్లి సాగర్, అతని స్నేహితులు ఒక్కసారిగా వంశీపై బీరు సీసాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో వంశీకి తలకు, కను బొమ్మలు, కుడి చెంప, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వంశీని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వంశీ ఫిర్యాదు మేరకు అల్లి సాగర్‌తో పాటు బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లికి చెందిన రత్నం సోమయ్య, ఆంబేద్కర్ నగర్‌కు చెందిన మామిడి అన్నమయ్య, మరో వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.