నేరడిగొండ, ఆగస్టు 30 : ఆదిలాబాద్ నేరడిగొండ మండలంలోని కొరిటికల్ బీ సమీపంలోని యూపీ దాబా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో బెడద శ్రీదేవి (32) అక్కడికక్కడే మృతి చెందినట్లు నేరడిగొండ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఎస్ఐ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. సిరికొండ మండలం కేంద్రానికి చెందిన ముత్యపు నాగన్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సిరికొండకు కారులో బయలు దేరారు.
నేరడిగొండ మండలంలోని కొరిటికల్ దాబా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్నది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నాగన్న భార్య శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న నాగన్న తలకు తీవ్ర గాయాలు కాగా, కూతురు కుడి చేయి విరగగా, కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. లారీ పార్కింగ్‌లో కాకుండా రోడ్డుపై నిలపడంతోనే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు.