ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్‌గేట్, జనవరి 12 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మ ల్ కలెక్టర్ అభిలాష అభినవ్‌కు అర్జీలు సమర్పించారు. ఆదిలాబాద్‌లో 83,నిర్మల్‌లో 45 అర్జీలు వచ్చాయి. సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిర్మల్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఆయా శాఖల నివేదకలు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆదిలాబాద్ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు శ్యామలదేవి, రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్‌లు.. నిర్మల్‌లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి పాల్గొన్నారు.
అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
భోరజ్ మండలంలోని శావాపూర్లో అనర్హులకు ఇండ్లు మంజూరయ్యాయని, వాటిని రద్దు చేయాలంటూ గ్రామస్తులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందించా రు. కొందరు నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సంబంధం లేకుండా వ్యవసాయ భూములు ఉన్న వారికి ఇండ్లను మంజూరు చేయించారన్నారు. దీంతో కూలీ పను లు చేసుకొనే పేదలకు ఇండ్లు రాలేదని, అనర్హులకు మంజూరైన ఇండ్లను రద్దు చేసి అర్హులకు అందించాలని కోరారు.
ప్రభుత్వ భూములు రక్షించాలి..
నిర్మల్ జిల్లాలోని తాండ్ర(జి) గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయని వాటిని రక్షించాలని కోరుతూ సోమవారం గ్రామస్తులు కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని చెరువులకు సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.