ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం గ్రామంలో అక్రమంగా నిలువచేసిన పీడీఎస్ బియ్యం ( PDS rice seize ) బ్యాగులను గురువారం టాస్క్ ఫోర్స్ ( Task Force) , ఊట్కూర్ పోలీసులు ( Utkoor Police ) దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద జట్రం గ్రామానికి చెందిన వీ రాజు అనే వ్యక్తి కొద్ది నెలలుగా పేదల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన 7 క్వింటాళ్ల 30 కిలోల బియ్యం లూజు బస్తాలను ఇంట్లో నిలువ చేసుకున్నాడు.
విశ్వసనీయ సమాచారం టాస్క్ ఫోర్స్, ఊట్కూర్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనంతరం డీటీ కాలప్ప ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. మండలంలో ఎవరైనా పీడీఎస్ రైస్ అమ్మినా, నిల్వ ఉంచినా, అక్రమంగా రవాణా చేసిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.