మంచిర్యాల అర్బన్/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జనవరి 1 : మందు బాబులు తెగతాగేశారు. కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025కు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31న ఒక రోజే మంచిర్యాల జిల్లాలోని 79 మద్యం దుకాణాలు, 17 బార్ అండ్ రెస్టారెంట్లలో రూ. 7 కోట్ల 70 లక్షల మద్యం పై చిలుకు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023 డిసెంబర్ 31న రూ.6 కోట్ల 47 లక్షల మద్యం అమ్మకాలు జరగగా, ఈసారి అదనంగా రూ.కోటీ 23 లక్షలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ. 5.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.