మంచిర్యాల, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్) మా 61.34 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. 1982 నుంచి ఆ ప్లాట్లను కొనుక్కుంటూ వచ్చాం. 2002లో ఈయన కన్ను పడి కజ్జా చేసిం డు. అప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నడు. హైకోర్టు కూడా ఆ భూములు మావే అని తేల్చి చెప్పింది. దీంతో 50 మంది వరకు ధైర్యం చేసి మా ప్లాట్లలో ఇండ్లు కట్టుకున్నం. కానీ.. రెండేళ్లుగా కట్టు కున్న ఇండ్లను కూల్చేస్తున్నడు. 20 మంది గుండాలు నిత్యం అక్కడే ఉంటున్నరు. పోయినోళ్ల మీద దాడు లు చేస్తున్నరు.” అని ఉద్యోగ్ దళిత బహుజన ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. ప్రేమ్ సాగర్‌రావు తమ భూములను కబ్జా చేసి, వేధింపు లకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి తమ బాధను చెప్పుకున్నరు.
జీహెచ్ఎంసీ కాప్రా మున్సిపల్ సర్కిల్ దగ్గరిలో సర్వే నంబర్లు 639/1, 648/1, 644/1, 647/ 1, 648 అండ్ 654లో శంషాబాద్ కిష్టయ్య అండ్ ఫ్యా మిలీకి చెందిన 61.34 ఎకరాల భూమి ఉంది. 1982లో ఆ భూమిని ప్లా ట్లు చేయడంతో 1982 నుంచి వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో పని చేసిన రిటైర్డ్ ఉద్యోగులు, ఇతరులు 706 మంది కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు.
పీసీసీ మెంబర్‌గా ఉన్నప్పుడే..
కొన్ని రోజులు అంతా బాగానే ఉన్నా.. ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మెంబర్‌గా, పీసీసీ సెక్రటరీగా ఉన్న సమయంలో ఈ మొత్తం భూ మిని కబ్జా చేసినట్లు బాధితులు చెప్తున్నారు. అప్పటి నుంచి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఎంత కొట్లాడినా ఆయనకు ఉన్న పలుకుబడి కారణంగా ఏం చేయలేకపోయమని వాపోయారు. హైకోర్టు జడ్జిమెంట్‌ను ఆ యన పట్టించుకోవడం లేదంటున్నారు. చివరకు ధైర్యం చేసి 50 మంది ఇండ్లు కూడా కట్టుకున్నామని, కానీ.. గడిచిన రెండేళ్లుగా కట్టుకున్న ఇం డ్లను ఆయన కూలగొట్టిస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయాన్ని రాహూల్‌గాంధీ, సోనియాగాంధీకి మెయిల్ ద్వారా చెప్పామని, రేవంత్‌రెడ్డి, మల్లికార్జున ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్లాం.
కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పం దన లేదంటూ వాపోయారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆ ప్లాట్లోనే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా 706 కుటుంబాల ఉసురు పోసుకుంటున్న పీఎస్ఆర్ మట్టికొట్టుకుపోతారని మండిపడ్డారు. అలాంటాయనకు మంచార్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో తాము మీడియా ముందుకు వచ్చామని చెప్పారు. అంతా కలిసి వెళ్లి మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి మంచిర్యాలలో గ్రహపాటునో, పొరపాటునో ప్రేమ్‌సాగర్‌రావును గెలిపిస్తే గుండా రాజ్యం, రౌడీరాజ్యం వస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఈ వ్యవహారం బలం చేకూర్చింది.
నన్ను చంపేందుకు ప్రయత్నించారు..
నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కాప్రాలో ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నా. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ పీఎస్ఆర్ 2002 నుంచి మమ్ముల్ని ఇబ్బంది పెడుతున్నడు. ఇటీవల నేను కట్టుకున్న ఇంటిని కూల గొట్టించిండు. న్యాయం అడిగేందుకు పోతే నాపై దాడి చేయించారు. నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
-గోపాల్‌రావు, జనరల్ సెక్రటరీ దళిత బహుజన ప్లాట్స్ ఓనర్స్ సంఘం