నిర్మల్ అర్బన్, జూలై 5 : ప్రతి పల్లెకు అభివృద్ధి పలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘతన సీఎం కేసీఆర్‌దేనని, జనరంజక పాలనను చూసే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మామడ మండలంలోని పరిమండల్ గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శాస్త్రీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో అగ్రగామిగా నిలిపిన దర్శనిక పాలకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ ప్రాధాన్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
దిలావర్పూర్, జూలై 5 : మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థికసాయం మంజూరైంది. గ్రామానిక చెందిన కౌట్ల ఇస్తారికి రూ.60వేలు, గట్టు లక్ష్మికి రూ. 37500 విలువైన చెక్కులను బుధవారం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అడెపు శ్రీనివాస్, వూజారం మహేశ్, సాయేందర్, కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ చిన్నయ్య ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి
బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లోకేశ్వరంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు. సీజీఎఫ్ నిధుల నుంచి రూ. 10లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అర్లి వంతెనను కూడా త్వరలోనే నిర్మాణం చేపతామని చెప్పారు. జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుంద్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు, ఎంపీపీ లలితా భోజన్న, మండల బీఆర్ఎస్ కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, ఎంపీపీ నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, నాయకులు రాంకిషన్ రెడ్డి, సర్పంచ్ కపిల్ సౌజన్య, మెండే శ్రీధర్, చిన్నారావు, నాలం గంగాధర్, సుదర్శన్ రెడ్డి, బండి ప్రశాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
వికేంద్రీకరణతోనే పాలన మెరుగు
పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చేపట్టి పారదర్శకమైన పాలనను అందిస్తన్నదని, ఉద్యోగులకు అండగా ఉంటున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని జడ్పీ ఉద్యోగులకు నూతనంగా మం జూరైన జీపీఎఫ్ కార్యాలయాన్ని జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా పని చేస్తున్న జీపీఎఫ్ కార్యాలయాన్ని కొత్త జిల్లాలకు విస్తరించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. జడ్పీలో పని చేస్తున్న ఉద్యోగులు తమ జీతభత్యాలకు సంబంధించిన జీపీఎఫ్‌ను గతంలో ఆదిలాబాద్‌లో లావాదేవీలు ఉండడంతో ఇబ్బందులు ఏర్పడేవని, ఇకనుంచి ఇక్కడే ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్,టీఎన్జీవో అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, రవికిరణ్, డీఆర్డీఏ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఉద్యోగ సంఘాల నాయకులు గజేందర్, నరేంద్రబాబు, రవికాంత్, రాజేశ్వర్, రాజేశ్వర్‌నాయక్, షబ్బీర్‌అలీ, అశోక్, తదితరులున్నారు.