Kharge : ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) పై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ (Rajya Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం రాజ్యసభలో ప్రధాని చేసిన ప్రసంగంలో పనికొచ్చే అంశం ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్‌ను నడపడం లేదని విమర్శించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఖర్గే.. నరేంద్రమోదీ అబద్ధాలు మళ్లీమళ్లీ చెప్పడమే తన పనిగా పెట్టుకున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని గురువారం సమాధానమిచ్చారు. అయితే ప్రధాని 97 నిమిషాల సమాధానంలో ఒక్కటైన్నా ముఖ్యమైన విషయంగానీ, తప్పనిసరి విషయంగానీ లేదని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై తాము చేసిన ప్రతిపాదనల్లో ఒక్కదానికి కూడా ప్రధాని స్పందించలేదని ఖర్గే చెప్పారు. ఆయన కేవలం 100 ఏళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్లు అని ఏదేదో మాట్లాడారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఆర్మీ మాజీ చీఫ్ నరవణె పుస్తకం విషయాన్ని ప్రస్తావించంగానే అధికార పక్షం మొత్తానికి నొప్పి కలిగిందని ఖర్గే వ్యాఖ్యానించారు.