చెన్నూర్ టౌన్/ ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 31 : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో తాకట్టు బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్‌తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు తేలింది. ఈ కేసులో క్యాషియర్ సహా 44 మందిని పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో విలేకరులతో సీపీ అంబర్ కిశోర్ ఝా వివరాలు వెల్లడించారు. బ్యాంకు లో 12.61 కోట్ల విలువైన 402 గోల్డ్‌లోన్ ఖాతాల ఆభరణాలు (25.17కిలోల బంగా రం), నగదు 1.10 కోట్లు గల్లంతైనట్లు గుర్తించిన బ్యాంకు రీజనల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా గత నెల 23న చెన్నూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలతో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాలో భారీగా అనుమానాస్పద డిపాజిట్లు కలిగి ఉండడంతో అతన్ని ప్రధాన నిందితుడిగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. రవీందర్ గతేడాది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో 40లక్షల దాకా పోగొట్టుకున్నాడు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మళ్లీ బెట్టింగ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి తాకట్టు బంగారం మాయం చేయాలని స్కెచ్ వేశాడు.
మేనేజర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో క్యాషియర్ గతేడాది అక్టోబర్‌లో తరచూ గోల్డ్‌లోన్ చెస్ట్ట్ నుంచి బంగారం తీసి తన స్నేహితులు మంచిర్యాల ఎస్బీఎఫ్సీ సేల్స్ మేనేజర్ కొంగోండి బీరేశ్, కస్టమర్ రిలేషన్ మేనేజర్ కొడాటి రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్‌కు అప్పగిస్తూ వచ్చాడు. వీరు ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనా న్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బులో కొంత కమీషన్ తీసుకొని మిగతా మొత్తాన్ని క్యాషియర్ రవీందర్‌కు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులు 10 ప్రైవేట్ గోల్డ్ లోన్ లెడింగ్ కంపెనీలైన ఎస్బీఎఫ్సీ, ఇండె ల్ మనీ, ముత్తూట్ ఫైనాన్స్, గోదావరి అర్బ న్, మణిపురం, ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లలో 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఇదేగాక రవీందర్ మరో మోసానికి తెరలేపాడు.
బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై అతని భార్య, బావమరిది, స్నేహితుల పేరిట 1.58 కోట్ల విలువైన 42 తప్పుడు గోల్డ్ లోన్లు తీశాడు. ఆభరణాలు డిపాజిట్ చేయకుండానే 4.4 కిలోలు తాకట్టు పెట్టినట్లు చూపించి డబ్బులు విత్‌డ్రా చేశాడు. ఇంకా ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే టైంలోనూ రవీందర్ డబ్బు అపహరించినట్లు తమ విచారణలో తేలిందని సీపీ చెప్పారు. ఈ కేసులో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులతోపాటు వారికి సహకరించిన 41 మందిని అరెస్ట్ చేశామని, తాకట్టు పెట్టిన అభరణాలు 15.23 కిలోలు రికవరీ చేసినట్లు వివరించారు. మిగితా ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు. ఈ కేసులో గోల్డ్ లోన్ కంపెనీ మేనేజర్ల పాత్రపై విచారణ జరుగుతుందన్నారు.
అరెస్టయిన వారిలో జైపూర్ మండలం శెట్టిపల్లికి చెందిన క్యాషియర్ నరిగే రవీందర్, బ్యాంకు మేనేజర్ వెన్నపు మనోహర్, అవుట్సోర్సింగ్ అటెండర్ లక్కాకుల సందీప్, మంచిర్యాల ఎస్బీఎఫ్సీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేల్స్ మేనేజర్ కొంగొండి బీరేశ్, కస్టమర్ రిలేషన్ మేనేజర్ కోదాటి రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్‌కుమార్, జైపూర్ మండలం శెట్టిపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ ఉమ్మాల సురేశ్, మంచిర్యాల జిల్లా రాళ్లపేటకు చెందిన నడిగొట్టి సాగర్, రామకృష్ణాపూర్‌కు చెందిన రాంశెట్టి చంద్రబాబు, భరతపు రాకేశ్, కడం రమేశ్, మంచిర్యాలలోని లక్ష్మీనగర్‌కు చెందిన దిగుట్ల సునీల్, బృందావన్ కాలనీకి చెందిన దారపు నాగరాజు ఉన్నారు.
ఈ కేసు బహిర్గతమయ్యేందుకు ప్రత్యేక కృషి చేసిన డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు, రూరల్ సీఐ బ న్సీలాల్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, మం చిర్యాల రూరల్ సీఐ అశో క్, డబ్ల్యూపీఎస్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్, ఇన్స్పెక్టర్ బాబురావు, ఎస్ఐలు సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోశ్, ల క్ష్మీప్రసన్న, కో టేశ్వర్, ఉపేందర్‌రావు, చంద్రశేఖర్, రవి, సి బ్బంది శంకర్, రవి, రమేశ్, ప్రతాప్, తిరుప తి, లింగమూర్తిని అధికారులు అభినందించారు.