చెన్నూర్/కోటపల్లి/మందమర్రి, నవంబర్ 25: బీసీలకు స్థానిక సంస్థలతో పాటు చట్ట సభలు, వి ద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు మంగళవారం మం చిర్యాల జిల్లా చెన్నూర్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ తీశారు. స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రీబాయిపూలే విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతులను దహనం చేశారు. తహసీల్దార్ మల్లికార్జున్‌కు వినతి పత్రం అందజేశారు. బీసీ సంఘాల నాయకులు రమేశ్‌యాదవ్, కృష్ణ పాల్గొన్నారు.

కోటపల్లి, నవంబర్ 25 : కోటపల్లి మండల కేం ద్రంలో బీసీ సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సర్వాయిపేట నుంచి కోటపల్లి వర కు బైక్ ర్యాలీ తీశారు. కోటపల్లిలో రోడ్డు బైఠాయిం చి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి చిన్నచూపని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం కో టపల్లి ఎంపీడీవో కార్యాలయ టైపిస్ట్ దెందుకూరి శివనాగ స్వాత్విక్కు వినతి పత్రం అందించారు. బీసీ సంఘాల నాయకులు పెద్దపోలు సాంబాగౌ డ్, ఎరినాగుల ఓదెలు, పెద్దింటి పున్నంచంద్, కొ ట్టె నారాయణ, మారిశెట్టి విద్యాసాగర్, గుర్రం శ్రీ నివాస్, గాదె శ్రీనివాస్, కందుల వెంకటేశ్, పూరెళ్ల మహేశ్, కామ శ్రీనివాస్, సల్పాల పోచం, కాయి త మల్లేశ్, రాళ్లబండి శ్యాంసుందర్, కడార్ల ధనుంజయ్, అంగ సంపత్, మహేందర్ పాల్గొన్నారు.
మందమర్రి, నవంబర్ 25 : మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను బీసీ సంక్షేమ సంఘం నాయకులు దహనం చేశారు. సంఘం పట్టణ అధ్యక్షుడు సకినాల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్వి నేరెళ్ల వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు వెంటనే 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన స్థానాలు కేటాయించాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రాంచందర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రామసాని శేఖర్, బేర వేణుగోపాల్, గట్ల సారంగపాణి, దేవులపల్లి ప్రభాకర్, పారుపల్లి శివరామకృష్ణ, రాజు, మడ్డి వేణుగోపాల్, జమాల్పురి నర్సోజీ, సత్యనారాయణ, మాడగోని శంకర్, పోలు కుమారస్వామి, చింతల రమేశ్, మహేందర్, హుస్సేన్ పాల్గొన్నారు.