సారంగాపూర్, అక్టోబర్ 17 ః నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాంసింగ్ తండా అటవీ ప్రాంతంలో గురువారం పిడుగుపాటుకు 40 గొర్రెలు, మేకలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన చౌహాన్ వినేశ్ గొర్రెలు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో పిడుగు పడడంతో 40 గొర్రెలు, మేకలు మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. మృతిచెందిన జీవాల విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉన్నట్లు తెలిపాడు. ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని కోరాడు.