Ttiger Killing Case | పెంచికల్పేట్, మే24 : పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబాడే తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పెంచికల్పేట్ రెవెన్యూ పరిధిలోని ప్రాంతంలో ఈనెల 14న విద్యుత్ తీగలు అమర్చి పులిని హతమార్చి చర్మం, గోర్లు, మీసాలు, దంతాలు తీసుకెళ్లారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాం.
కేసులో ప్రమేయం ఉన్న 30 మందిని సిర్పూర్ సివిల్ కోర్టులో హాజరుపరుచగా కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. వారిని అసిఫాబాద్ జిల్లా జైలుకు తరలించాం.
అప్పాజీ శ్రీనివాస్, అప్పాజీ వెంకటేష్, ఎల్కర్ శేఖర్, రోహిణి శ్రవణ్, చప్పిడే అశోక్, చాపిడే పవన్ కుమార్, ఎల్కరి ప్రకాష్, బుర్రి వెంకటేష్, కాటేల సాగర్, నికాడి వెంకటేష్, లాత్కరి శ్రీనివాస్, భింకరి వెంకటేష్, బింకరి రంగయ్య, లేగల గోపాల్, రాచకొండ లచ్చయ్య, ఓండ్రె సంతోష్, తుమ్మిడే శ్రీనివాస్, ఎల్కరి సుగుణాకర్, బుర్రి తిరుపతి, ఓండ్రె నారాయణ, లేగల వెంకటేష్, గోమాసి రాజన్న, మడె మధునయ్య, లేగల సత్యనారాయణ, ఎల్లూరి లచ్చన్న, మౌల్కర్ దివాకర్, బిన్కర్ తిరుపతి, తుమ్మిడె సత్తయ్య, పెద్దల నీలయ్య, గావుడె శంకర్ ఉన్నట్లు తెలిపారు.