నిర్మల్ అర్బన్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, భైంసాలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, బోథ్‌లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పలుచోట్ల శాంతి కపోతాలు, బెలూన్లు ఎగురవేశారు. క్రీడాజ్యోతిని వెలిగించి పరుగెత్తారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతు న్నాయి. జూన్ 2వ తేదీన ప్రారంభం కాగా.. 22వ తేదీ వరకు కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటివరకు జాతీయ పతాకావిష్కరణ, రైతు దినోత్సవం, సురక్ష దివస్, తెలంగాణ విజయో త్సవం, తెలంగాణ పారిశ్రామిక విప్లవం, సాగునీటి దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ, తెలంగాణ సంక్షేమ సంబురాలు, సుపరిపాలన దినోత్సవం, సాహిత్య దినోత్సవం వంటి కార్యక్రమాలు అద్భు తంగా జరిగాయి. తాజాగా సోమవా రం పోలీసుశాఖ ఆధ్వర్యంలో 2కే రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధికారులు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా శివాజీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ 2 కె రన్లో ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్పీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖానాపూర్, జూన్ 12 : ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 2కే రన్‌ను ఎమ్మెల్యే రేఖానాయక్ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగగా.. అధికారులు, యువకులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు శ్యాంనాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, సీఐ అజయ్‌బాబు, ఎస్ఐ శంకర్, ఎంపీడీవో బాల మల్లేశం, కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు.
భైంసా, జూన్ 12 : భైంసా పట్టణంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ 2 కే రన్‌ను ప్రారంభించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో పట్టణ సీఐ శీను, రూరల్ సీఐ చంద్రశేఖర్, ముథోల్ సీఐ వినోద్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారుఖ్ హైమద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 12 : ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి 2కే రన్‌ను ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి, బెలూన్లు వదిలారు. స్టేడియం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు రన్ కొనసాగింది. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో, డీఎస్పీ ఉమేందర్ పాల్గొన్నారు.
బోథ్, జూన్ 12 : బోథ్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు నిర్వహించిన 2కే రన్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి, బెలూన్లు వదిలి రన్‌ను ప్రారంభించారు. యువత, నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
గర్మిళ్ల, జూన్ 12 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ అట్టహాసంగా నిర్వహించారు. కలెక్టర్ బదావత్ సంతోష్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఐబీ చౌరస్తా నుంచి జడ్పీ బాలుర పాఠశాల వరకు కొనసాగింది. డీసీపీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
చెన్నూర్ టౌన్, జూన్ 12 : చెన్నూర్ పట్టణంలో జైపూర్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జలాల్ పెట్రోల్ బంక్ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం వరకు రన్ కొనసాగగా, పోలీసులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెన్నూర్ సీఐ వాసుదేవరావు, కోటపల్లి, శ్రీరాంపూర్ సీఐలు విద్యాసాగర్, రాజు, చెన్నూర్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఎస్ఐలు ఉపేందర్, చంద్రశేఖర్, రాజేశ్, సుబ్బారావు, వెంకటస్వామి, సౌజన్య, శ్వేత, గంగరాజు గౌడ్, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కారెంగుల రాములు, పీడీలు మల్లేశ్, ఫణికుమార్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి, జూన్ 12 : బెల్లంపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర సంతోష్ బదావత్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిలక్ స్టేడియం నుంచి ప్రారంభమైన రన్ పాత బస్టాండ్, కాంటా చౌరస్తా మీదుగా ఏఎంసీ గ్రౌండ్ వరకు కొనసాగింది. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. జీఎం మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ఏసీపీ సదయ్య పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, జూన్12 : జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ వద్ద జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎస్పీ సురేశ్‌కుమార్ అధ్యక్షతన 2కే రన్ నిర్వహించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ వద్ద ప్రారంభమై బస్టాండ్, చిల్డ్రన్ పార్ మీదుగా తిరిగి హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నది. కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్‌పాయి, ఆసిఫాబాద్ మారెట్ కమిటీ చైర్మన్ గాదవేని మల్లేశ్, డీఎస్పీ శ్రీనివాస్, ఆసిఫాబాద్ సీఐ రాణా ప్రతాప్, డివిజన్ పరిధిలోని పోలీసులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, జూన్ 12 : కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ జెండా ఊపి 2 కే రన్‌ను ప్రారంభించారు. ఎస్పీఎం క్రీడామైదానం నుంచి ఈఎస్ఐ వాటర్ ట్యాంక్ మీదుగా తిరిగి క్రీడామైదానం వరకు ర్యాలీ చేరుకుంది. యువతీ యువకుల విభాగాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. న్యూట్రిషన్ ప్లస్ డాక్టర్ గుప్తా బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరోబిక్, జుంబా వ్యాయామం అందరినీ ఆకట్టుకుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ ఉన్నారు.