గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 ,

పురంలో ‘యువ’ జోరు

పురంలో ‘యువ’ జోరు
  • 18 స్థానాలు కైవసం
  • అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే..

ఆదిలాబాద్‌ రూరల్‌ : రాజకీయం అంటే ఎక్కువగా కనిపించేది వయసు మీద పడిన వారే. నేటి యువత రాజకీయం కన్నా ఉద్యోగాలు చేసుకోవడంలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. రాజకీయం అంటే కంపు అనే వారే ఎక్కువ. కానీ నేటి సమాజానికి కావాల్సింది యువరక్తం. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఫలితాలను పరిశీలిస్తే ఆదిలాబాద్‌ ప్రజలు యువరక్తంపై ఎక్కువ ఆశలుపెట్టుకుని వారిని మున్సిపల్‌ కౌన్సిలర్‌లుగా గెలిపించారు. మున్సిపాలిటీలో 49 వార్డులుంటే 18వార్డుల్లో యువతీయువకులను గెలిపించారు.

యువత గెలుపొందిన వార్డులు

మున్సిపాలిటీలోని 18 వార్డులో 30 నుంచి 40 ఏళ్లలోపు వయస్సున్నవారు విజయం సాధించి యువత ఏ రంగంలోనైనా రాణించగలదని నిరూపించారు. ఇందులో 10 మంది అభ్యర్థులు రాజకీయాలకు కొత్త. వీరు మొదటి సారి పోటీలో నిలబడ్డారు. వార్డు నంబర్‌ 9 నుంచి ఉష్కం రఘుపతి, వార్డు నంబర్‌ 4 నుంచి శ్రీనివాస్‌, వార్డు నంబర్‌ 47 నుంచి సోమ స్వప్న, వార్డు నంబర్‌ 41 నుంచి కృష్ణయాదవ్‌, వార్డు నంబర్‌ 45 నుం చి బండారి సతీశ్‌, వార్డు నంబర్‌ 34 నుంచి జోగు ప్రేమేందర్‌, వార్డు నంబర్‌ 40 నుంచి భరత్‌కుమార్‌, వార్డు నంబర్‌ 12 నుంచి పవన్‌నాయక్‌, వార్డు నంబర్‌ 21 నుంచి కొండమీన, వార్డు నంబర్‌ 28 నుంచి సునీత, వార్డు నంబర్‌ 18 నుంచి కోవ రవి, వార్డు నంబర్‌ 17 నుంచి నజీర్‌ అహ్మద్‌, వార్డు నంబర్‌ 25 నుంచి పి.రాజేశ్‌, వార్డు నంబర్‌ 3 నుంచి సాయి ప్రణయ్‌, వార్డు నంబర్‌ 39 నుంచి సంగీత జబాడే, వార్డు నంబర్‌ 15 నుంచి సంగీత వంజారే, వార్డు నంబర్‌ 16 నుంచి షాహిదా షేక్‌, వార్డు నంబర్‌ 11 నుంచి షానవాజ్‌ విజయం సాధించారు. 

యువతపై ప్రజల నమ్మకం..

మారుతున్న వ్యవస్థను బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎంత సేపు అనుభవమున్న వారినే నాయకులు కాకుండా కొత్తవారికి సైతం అవకాశం కల్పిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ శాతం యువత ఓటుహక్కును వినియోగించుకున్నది. పోటీల్లో సైతం చాలా పార్టీల నుంచి యువతకు ఎక్కువగా అవకాశం కల్పించడంతో వారు సైతం తాము రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. ఆయా కాలనీల్లో ప్రజలు నిరంతరం తమకు అందుబాటులో ఉంటూ తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారినే కౌన్సిలర్‌లుగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎంపికైన యువ కౌన్సిలర్‌లపై ఆయా కాలనీల ప్రజలు భారీ అశలు పెట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ఉన్నారు. logo
>>>>>>