దస్తురాబాద్ (కడెం), ఏప్రిల్ 2: కడెం మండలంలోని అంబారిపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందా యి. బాధితుడు కొండ వేణి కొమురయ్య తెలి పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పాక లో గొర్రెలను ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 20 గొర్రెలు మృతిచెందగా, మరో ఆరు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయమై సర్పంచ్ కొప్పుల లక్ష్మితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. మృతిచెందిన 20 గొర్రెల విలువ రూ.2.50 లక్షల వరకు ఉంటుందని వాపోయాడు. అధికారులను కోరారు. గ్రామంలో కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.