రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద గురువారం దేశిదారు మద్యం బాటిళ్లు ( Desidar bottles ) ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ రమేష్ కుమార్ ( CI Ramesh Kumar ) తెలిపారు. ఎన్నికల సమయంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పట్టుబడిన 18 కాటన్ల దేశిదారు బాటిళ్లను పగలగొట్టిన అనంతరం జేసీబీ ( JCB ) సాయంతో పూర్తిగా ధ్వంసం చేశామన్నారు.
మండలంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మూడు లీటర్ల నాటు సారాతో ఒకరిని పట్టుకుని సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు కమలాకర్, మమత, విజయలక్ష్మి ఉన్నారు.