అందుబాటులో గ్రామ స్వరాజ్ ఈ యాప్
పంచాయతీల ఆదాయ, వ్యయాల పూర్తి వివరాలు
పారదర్శకతకు పెద్ద పీట
ఇచ్చోడ, జూన్ 4:పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తు న్నది. ఇందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జీపీలకు ప్రభు త్వం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నది. ఇక నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, వాటి ఖర్చులు, ఆదాయ వివరాలు ఇక స్మార్ట్ ఫోన్లో కనిపించనున్నాయి. ఏ పనికి ఎంత ఖర్చు చేశారో తెలుసుకోవడానికి ఏ అధికారిని కలువాలి..? ఆ అధికారి లేకుంటే ఇంకెవరిని కలువాలి..? కలి స్తే వెంటనే వివరాలు ఇస్తారా..? అనే అనుమానాలు ఉండే వి. ఒకవేళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన రీతిలో స్పందన ఉండేది కాదు. దీంతో ఇబ్బందులు ఎదుర య్యేవి. ఇక ఇలాంటి ఇక్కట్లకు చెక్ పడనుంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పంచాయతీ పా లన మరింత పారదర్శకంగా ఉండేందుకు గ్రామ స్వరాజ్ యాప్ను తీసుకొచ్చింది. స్వరాజ్ యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని గ్రామానికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది.
యాప్ డౌన్లోడ్ ఇలా…
నేటి కంప్యూటర్ యుగంలో ప్రతి ఇంటా స్మార్ట్ ఫోన్ కలి గి ఉన్నారు. ప్రతి ఒక్కరికీ సమాచారం అందుబాటులో ఉండడంతో పాటు, పారదర్శకంగా ఆర్థిక వ్యవహారాలు అం దుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ – గ్రామ స్వరాజ్ యాప్ను ప్రభుత్వం ఇటీవలే రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. కావాల్సిన పంచాయతీ, నియోజక వర్గం, జిల్లా పరిషత్, మండల పరిషత్ పేర్లు నమోదు చేయాలి. దీంతో మూడు వివరాలు ఉన్న పేజీ కనిపిస్తుంది. అవన్నీ ఆమోదం పొందిన తర్వాతే కార్యక్రమాలు, ఆర్థ్ధిక పురోగతి వివరాలున్న పేజీలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలో ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారనే వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే వీలుంటుంది.