స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్.. భైంసా ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి.. ఇచ్చోడలో ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ పాల్గొన్నారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి రక్తదానం చేయగా.. శిబిరాలకు పలు శాఖల అధికారులు, యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కడెం మండల కేంద్రంలో నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేయగా.. నార్నూర్ మండలంలోని ఖైరదట్వా గ్రామంలో పోలీసులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో
భాగంగా బుధవారం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో రక్తాదాన శిబిరాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. యాపల్‌గూడ రెండో బెటాలియన్ సిబ్బంది, ఉద్యోగులు రక్తదానం చేశారు. అనంతరం ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానలో ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి రక్తదానం చేశారు. ఇచ్చోడ ప్రభుత్వ దవాఖానలో శిబిరం నిర్వహించగా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాథోడ్ నరేందర్ హాజరయ్యారు. నార్నూర్ మండలంలోని ఖైరదట్వా గ్రామంలో పోలీసులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా జైలులో కూడా రక్తదానం నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏరియా దవాఖానలో పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో శిబిరం ఏర్పాటు చేయగా.. పలు శాఖల అధికారులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. కడెం మండల కేంద్రంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా దవాఖానలో కూడా మెగా రక్తదానం నిర్వహించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి హాజరయ్యారు.