ఎదులాపురం, జూలై 1 : ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మంగళవారం పట్టణంలోని బీసీ గురుకులంతోపాటు కోలాం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ముందుగా న్యూ హౌజింగ్ బోర్డులోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాలను సందర్శించారు.
అకడ విద్యార్థుల సంఖ్య, అందుతున్న విద్య తదితర వాటి గురించి ప్రిన్సిపల్ కీర్తిని అడిగి తెలుసుకున్నారు. అకడి నుంచి జగ్జీవన్‌రామ్ చౌక్ లోని కోలాం ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా తమ బాధ్యతలో భాగంగా సమస్యలను తెలుసుకుంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రస్తవించేలా పాఠశాలలు, గురుకులను సందర్శించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజయ్, పవన్ నాయక్, రంగినేని శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు.