ఉట్నూర్, మే 23 : ప్రభుత ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. తమ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేయడంతో మంగళవారం ఉట్నూర్‌లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీతో కలిసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచిపెట్టి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో చాందురి సర్పంచ్ ప్రకాశ్, బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్కైసర్, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, మే 23 : సిరికొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లో ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ సర్వీసుల క్రమబద్ధీకరణ దిశగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం సిరికొండ మండలాధ్యక్షుడు శ్రీధర్, ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు సునీల్ కుమార్, అరుణ్, శ్రీనివాస్, జైపాల్, అమ్జద్, నీత పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, మే 23 : సీఎం కేసీఆర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ కోసం విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించడంపై మండల కేంద్రంలో సంబురాలు చేసుకున్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో కలిసి జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జేపీఎస్‌లు శ్రీకాంత్, అరుణ్ రెడ్డి, నిఖిల్‌రెడ్డి, జ్యోతి, సునీల్‌సింగ్, రాజురెడ్డి, చంద్రకాంత్, నర్సయ్య, రాజేశ్వర్, ప్రభాకర్, రవికిరణ్, పవన్‌కుమార్, నేరడిగొండ ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, నాయకులు కరణ్‌సింగ్ పాల్గొన్నారు.
బేలలో..
బేల, మే 23: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మిఠాయిలు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, నాయకులు విఠల్ వారాడే, దంతల వినోద్, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, జోగు ప్రణయా, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్‌లో..
జైనథ్, మే 23 : మండలకేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీల కార్యదర్శులు, ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో..
ఎదులాపురం, మే 23 : జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో అధికారులు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫ్లెక్సీలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఎస్సీ వెంకట్రావు మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌లో కొత్త పోస్టులు, డివిజన్లు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏఎస్సీ ఆర్ మహేశ్‌కుమార్, సూపరింటెండెంట్ సంతోష్ ,సిబ్బంది పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి
బోథ్, మే 23 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను ఆపేందుకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మంగళవారం సర్పంచ్ సురేందర్ యాదవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుమేర్ పాషా, ఖాసీముద్దీన్, వార్డు సభ్యులు షేక్ షాకీర్, గిరీశ్, వినయ్ ఉన్నారు.
సీఎం కేసీఆర్‌తోనే సమగ్ర అభివృద్ది
భీంపూర్, మే 23 : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ప్రగతి సుసాధ్యమవుతున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి అన్నారు. భీంపూర్ మండలం రేంగన్గూడ, నీంగూడ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. గిరిజనులతో మాట్లాడారు. ఆమె వెంట సర్పంచ్ శంభు, నాయకులు మెస్రం మాణిక్‌రావ్, శంభు, పెందూర్ లక్ష్మణ్‌రావ్, లక్ష్మణ్, గంగారా ఉన్నారు.