కుభీర్, ఏప్రిల్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. చాలా చోట్ల స్తంభాలకు బల్బులు కూడా లేవు. రాత్రయిందంటే చాలా పంచాయతీలు భయంగా కాలం వెళ్లదీస్తున్నాయి. బయటకు రావాలంటే జనం జంకుతున్నారు.
సోమవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మాలేగాం గ్రామంలో మహాదేవుని జెండా వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాలేగాం తాజా మాజీ సర్పంచ్ విఠాపూర్ మహిపాల్‌రెడ్డి ఉదారతను చాటుకున్నాడు. రూ.8వేలు వెచ్చించి బల్బులు, హోల్డర్లను తెప్పించాడు. జీపీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని, పదేళ్లలో ఈ పరిస్థితి ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నారు.