e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిందగీ అద్దాల్లో..ముద్దుగుమ్మ!

అద్దాల్లో..ముద్దుగుమ్మ!

అందమైన నగలతో అంతకంటే అందంగా ముస్తాబు కావాలనుకుంటారు మగువలు. కనుబొమలు దిద్దుకుని, పెదాలకు మెరుపులు అద్దుకుని, నుదుట తిలకం పెట్టుకొని, సిగలో పూలు తురుముకొని అలంకరణ పూర్తవగానే అద్దంలో చూసుకుని మురిసిపోతారు. అయితే, ఆ అద్దాలే ఇప్పుడు ఆభరణాల్లో ఒదిగి పోతున్నాయి. మహిళల అందాన్ని మరింత పెంచుతున్నాయి.

అద్దాల్లో..ముద్దుగుమ్మ!

మహిళల దుస్తులమీద మెరిసే అద్దాలే మిర్రర్‌ జువెలరీ, గ్లాస్‌ జువెలరీ పేరుతో నగల ప్రపంచంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆభరణాల్లో అద్దాల తాపడం పూర్వం నుంచే ఉంది. లంబాడీలు, గోండులు ఇప్పటికీ అద్దాలు అమర్చిన దుస్తులను ధరిస్తారు. ఆ సంప్రదాయ శైలిని అనుకరిస్తూ ఎంబ్రాయిడరీ వర్క్స్‌లో చిన్నచిన్న అద్దాలను కూర్చి బ్లౌజ్‌లు, చీరల బార్డర్లు, చుడీదార్లకు ముద్దొచ్చే డిజైన్లు వచ్చేశాయి. తాజాగా ఆభరణాల్లోనూ అద్దాలు అమరిపోతున్నాయి.

ఆపాదమస్తకం..
దుస్తులకు తగిన నగలు వేసుకోవాలనుకుంటారు మహిళలు. మ్యాచింగ్‌ తప్పనిసరి. పాపిట బిళ్లనుంచి కాలి పట్టీల వరకు ఒకే డిజైన్‌ ఉండాల్సిందే. అద్దాల నగలనుకూడా సెట్ల రూపంలో అందిస్తున్నారు. హారాలు, నెక్లెస్‌లకు ఎక్స్‌టెండ్‌ చేసుకోడానికి వీలుగా సిల్క్‌ లేదా కాటన్‌ దారం తూడులను జత
చేస్తున్నారు.

అద్దాల్లో..ముద్దుగుమ్మ!

వెండి మెరుపులతో…
బంగారు ఆభరణాలకంటే వెండి నగల్లోనే అద్దాలను ఎక్కువగా పొదుగుతారు. వెండి మెరుపుతో పోటీ పడుతూ అద్దాలు తళుకులీనుతున్నాయి. అద్దాల చుట్టూ వెండితో చేసిన గుట్టపూసలు పొదిగి, నగలకు కొత్త వగలు జత చేస్తున్నారు. కంఠాభరణాలు, గాజులు, ఉంగరాలు, జుంకాల్లో అద్దాలు ఒద్దికగా ఒదిగి పోతున్నాయి. ముఖ్యంగా పార్టీవేర్‌గా ధరించేందుకు నవతరం ఆసక్తి చూపుతున్నది. గుండ్రంగా, చతురస్రాకారంగా, త్రిభుజాకారంగా ఉండే అద్దాలను అదే డిజైన్లలో అమర్చే ట్రెండ్‌ ప్రస్తుతం రాజ్యమేలుతున్నది.

అద్దం కాని అద్దం
ఏకాస్త ఏమరుపాటుగా ఉన్నా పగిలిపోతాయి అద్దాలు. గీతలు, పగుళ్ళు పడితే పునరుద్ధరించడం కుదరని పని. అందుకే, అచ్చం అద్దంలా కనిపించే ప్లాస్టిక్‌, ఫైబర్‌ షీట్స్‌ వచ్చేశాయి. గృహ నిర్మాణ రంగంలో, కళ్ళద్దాల తయారీలో వాటినే వాడుతున్నారు. అద్దంతో పోలిస్తే ధర ఎక్కువైనా మన్నిక విషయంలో ఢోకా లేదు. దీంతో వీటివైపే మొగ్గు చూపుతున్నారు.

చౌక ధరకే!
బంగారం, వెండి, ప్లాటినమ్‌ వంటి లోహాలతో పోలిస్తే ఈ అద్దాల నగలు చాలా చవక. అంతేకాదు మెరుపులోనూ, ఫ్యాషన్‌లోనూ వాటికేమాత్రం తీసిపోవు. అందుకే, విలక్షణమైన ఈ అద్దాల నగలు ధరించి, నిలువుటద్దంలా మెరిసి పోతున్నారు అతివలు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అద్దాల్లో..ముద్దుగుమ్మ!

ట్రెండింగ్‌

Advertisement