మహిళలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తీసుకునే ఆహారం నుంచి నిద్రవేళల వరకు అన్నిటినీ సమతౌల్యం చేసుకోవాలి. ఎందుకంటే, మహిళలను కబళించే చాలా క్యాన్సర్లు చాపకింద నీరులా పాకుతాయి. గుర్తించడంలో ఆలస్యమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ రోగమైనా వచ్చాక బాధపడే కంటే, రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. ముఖ్యంగా మహిళల పాలిట శాపంగా మారుతున్న రొమ్ము క్యాన్సర్‌ను అధిగమించేందుకు అనేక ‘వంటింటి’ మార్గాలున్నాయి.
వంటకు రంగునివ్వడం ఒక్కటే పసుపు ప్రయోజనం కాదు. ఇందులోని ‘కర్క్యుమిన్’ అనే పదార్థంవల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్లను నివారిస్తుంది. రోజూ వంటల్లో వాడితే రొమ్ము క్యాన్సర్ బారినపడే అవకాశాలు తగ్గుతాయి.
రోజుకు 60 గ్రాముల చొప్పున వాల్నట్స్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్‌ను సగానికి సగం దూరం తరిమేయ
వచ్చని తాజా నివేదికలు తెలిపాయి. వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో
స్టెరాల్స్ క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి.
ఈ రెండిట్లోని అలైల్ సల్ఫైడ్స్ రొమ్ము క్యాన్సర్ నివారణకు తోడ్పడుతాయి. అందుకే రోజువారీ వంటల్లో ఉల్లి, వెల్లుల్లి తప్పకుండా వాడాలి.
వీటిలో లైకోపేన్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది టమాటాకు ఎర్రదనం ఇవ్వడమే కాదు, క్యాన్సర్ కణాల ఎదుగుదలను ఆపుతుంది. రొమ్ము క్యాన్సర్‌కు వ్యతి
రేకంగా పోరాడుతుంది.
మయూరి ఆవుల,న్యూట్రిషనిస్ట్
www.trudiet.in