‘బ్యాడ్ ప్రొటీన్’ అంటే ఏమిటి?
.. గూగుల్‌లో చాలామంది సమాధానం వెతుకుతున్న ప్రశ్న. ప్రొటీన్లలో మూడు రకాలు ఉంటాయి. వాటిలోని అమైనో ఆమ్లాల శాతాన్నిబట్టి ఈ విభజనజరిగింది.
ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ప్రొటీన్ : దీన్ని నాణ్యమైన ప్రొటీన్‌గా చెప్పవచ్చు. పది రకాల అమైనో ఆమ్లాలు ఉండటంవల్ల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఆర్గానిక్ గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, నాటుకోడి, చేపలు, మాంసంలో ఇది ఉంటుంది.
సెకండ్ క్లాస్ క్వాలిటీ ప్రొటీన్ : ఇందులో కొన్ని అమైనో ఆమ్లాలు ఉండవు. ఇది ఎదుగుదలలో సాధారణంగానే పని చేస్తుంది. కానీ, పప్పు, సిరి ధాన్యాల విషయంలో బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. ఎందుకంటే, సిరి ధాన్యాల్లో లైసిన్ అనే అమైనో యాసిడ్ ఉండదు. అలాగే, పప్పు ధాన్యాల్లో మిథియోనైన్ అనే అమైనో యాసిడ్కూడా ఉండదు. అందువల్ల ఈ రెండు రకాల ధాన్యాలను సమపాళ్లలో తీసుకోవాలి. ఈ రకం ప్రొటీన్ గోధుమలు, రాజ్మా, శనగలు, పెసర్లు, అలసందలు మొదలైన వాటిలో లభిస్తుంది.
అసంపూర్ణ ప్రొటీన్ : ఇందులో చాలారకాల అమైనో ఆమ్లాల కొరత ఉంటుంది. ఇది ఎదుగుదలలో ఉపయోగపడదు కానీ, పరిపూర్ణ ఆరోగ్యం కోసం మిగిలిన ప్రొటీన్లతోపాటే తీసుకోవాలి. దీనివల్ల
ఎలాంటి నష్టం ఉండదు. జెలాటిన్, మక్కజొన్నల్లో ఈ ప్రొటీన్ లభిస్తుంది. అంతేకానీ, ‘చెడు ప్రొటీన్’ అనేది మాత్రం లేనే లేదు.