కళంకారీ చీరలకు ప్రాణం పోస్తున్న నారాయణపేట జిల్లా మహిళలు
Kalamkari Sarees | నారాయణపేట జిల్లా మహిళలు తెలంగాణలోనే తొలిసారిగా కలంకారీ చీరలకు ప్రాణంపోస్తున్నారు. కొత్తతరాలకు పాఠాలూ నేర్పుతున్నారు.
Kalamkari Sarees | పురాణ ఘట్టాలనో, ప్రకృతి దృశ్యాలనో ఎంచుకుంటారు. వాటికో అందమైన రూపమిచ్చి సహజ వర్ణాలతో సింగారిస్తారు. వస్త్రమే క్యాన్వాసుగా అద్భుతాలు సృష్టిస్తారు. ఇంకేముంది, ప్రతి చీరా కళాఖండమే! నారాయణపేట జిల్లా మహిళలు తెలంగాణలోనే తొలిసారిగా కలంకారీ చీరలకు ప్రాణంపోస్తున్నారు. కొత్తతరాలకు పాఠాలూ నేర్పుతున్నారు.
మహిళల్లో శ్రమించేతత్వం అపారం. సృజన పుష్కలం. ఆ ఉత్సాహానికి ప్రోత్సాహం తోడైతే అద్భుతాలే. నారాయణపేట జిల్లాలో జరుగుతున్నది అదే. అప్పటివరకూ ఆంధ్ర
ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకే పరిమితమైన కలంకారీ పనితనాన్ని తెలంగాణలో తొలి సారిగా నారాయణపేట మహిళలకు పరిచయం చేశారు జిల్లా కలెక్టర్ హరిచందన. నారాయణపేట అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేనేత చీరలు. కానీ పోటీ పెరిగిపోవడంతో.. మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమైంది. మార్పు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కొత్త డిజైన్లను తీసుకురావాలని భావించారు కలెక్టర్.

ముందుగా కలంకారీపై ఆసక్తి కలిగిన అరవైమంది మహిళలకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో నాబార్డ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. మరో 30 మందికి బ్లాక్ పెయింటింగ్ వర్క్ నేర్పించారు. ఆ తర్వాత, నారాయణపేటలోని మూల హనుమాన్ ఆలయం సమీపంలో కలంకారీ పెయింటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటికే తర్ఫీదు పొందిన మహిళలు ఇక్కడ చీరలపై పెయింటింగ్స్ వేస్తున్నారు. ఆ తర్వాత మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆ పనితనం మగువల మనసు దోచింది. ఫలితంగా గిరాకీ పెరిగింది.

కొత్తదనమే ప్రాణం
కలంకారీని ‘పట్టచిత్ర’ అనీ పిలుస్తారు. ఇది ఇప్పటికీ ఒడిశా, నేపాల్‌లో ప్రాచుర్యంలో ఉన్నది. సంస్కృతంలో ‘పట్టా’ అంటే వస్త్రం. ‘చిత్ర’ అంటే బొమ్మ. వస్త్రంపై వేసే చిత్రాలని అర్థం. గోల్కొండ సుల్తానుల కాలంలో కలంకారీ శైలి ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతున్నది. రామాయణ, మహాభారత ఘట్టాలు, బౌద్ధ కళారూపాలు, సంగీత వాద్యాలు, పూలు, పక్షులు, స్వస్తిక్ చిహ్నం.. కలంకారీ డిజైన్లలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, నలుపు, నీలం తదితర వర్ణాలను సహజ సిద్ధంగా తయారు చేసుకుంటారు. ఇందుకు చెట్ల ఆకులు, పూలు, వేర్లు, రాగి, పటిక, ఇనుము, తగరం ఉపయోగిస్తారు. వెదురు కర్రలో దూది పెట్టి బ్రష్ తయారు చేసుకుంటారు. ‘ముందు నుంచీ నాకు కళలు అంటే ఆసక్తి. మహిళా సంఘాల ద్వారా హైదరాబాద్‌లో మూడు నెలలు శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు నేనే స్వయంగా డిజైన్లు వేస్తున్నాను’ అని చెబుతారు ధూల్‌పేట వాసి పూజ. ‘మాకు మంచి ఉపాధి లభిస్తున్నది. ఆదాయం పెరిగే అవకాశాలూ ఉన్నాయి’ అంటున్నప్పుడు కలంకారీ కళాకారిణి మాధవి గొంతులో అపారమైన ఆత్మవిశ్వాసం.
…✍ వారధి నవీన్‌కుమార్
Read More :
“అప్పుడు చెత్తతో ఏం పని అన్నరు.. కానీ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తోంది”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

