ఈ చలికాలంలో దురదగా ఉంటుందా? ఇంట్లో దొరికే ఈ వస్తువులను ఇలా వాడితే..

skincare tips | చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, మొటిమలు మొదలైన సమస్యలు సాధారణం. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చర్మ కణాల్లోని తేమ తగ్గుతూ ఉండటమే దీనికి కారణం. అయితే మార్కెట్లో దొరికే వివిధ మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్లు తాత్కాలికంగా ఊరటనిచ్చినా, వాటిలోని రసాయనాలు చర్మంపై దుష్ప్రభావం చూపుతాయి. అందుకే వంటింట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే చర్మాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్‌లు.
పసుపును వంటల్లో వాడితే, అందులోని ఔషధ గుణాలు పొడిబారిన చర్మాన్ని మామూలు స్థితికి తీసుకొస్తాయి.
వారానికోసారి పసుపు, పాలు, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకున్నా, చర్మం మృదువుగా మారి మచ్చలు దూరమవుతాయి.
అలాగే ఇంట్లోనే షియా బట్టర్, కొబ్బరి నూనె, బాదం నూనె, కలబంద గుజ్జు, బీస్ వ్యాక్స్ సమపాళ్లలో కలిపి సహజసిద్ధమైన బాడీ లోషన్ తయారు చేసుకోవచ్చు.
ఈ సీజన్లో రోజూ చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆముదం రాసుకుని, కొద్దిసేపు మర్దనా చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
వీటితోపాటు చలికాలంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం, గింజ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.
మైదాపిండి వంటకాలు, వేపుళ్లు, కేకులు, కుకీలు వంటి బేకరీ పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
ఇలా చేస్తూనే రోజుకు కనీసం 7-8 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరగడంతోపాటు, చర్మం నిగనిగలాడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మేకప్‌తో నిద్రపోతున్నారా.. సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..!
ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా! మీ కిచెన్‌లో ఉండే వీటిని ట్రై చేసి చూడండి
Coffee Face pack for Healthy Skin | చర్మసౌందర్యానికి కాఫీ ఫేస్‌ప్యాక్
మొటిమలు పోయేందుకు తమన్నా ఏం వాడుతుందో తెలుసా?
ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

