e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?

ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?

ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?

హైదరాబాద్,మే, 28: చర్మ సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలకు బయట లభించే క్రీములు వాడడం కంటే ఇంట్లో ఉండే పదార్దాలతో ముఖాన్ని అందంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయను ముఖానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. నిమ్మకాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.పైగా నిమ్మకాయ వాడడం వల్ల ఎటువంటి సమస్యలు రావు.

ముందుగా ఒక బౌల్ లో కొద్దిగా పాలు, ఆరెంజ్ తొక్కల పొడి, నిమ్మరసం కలిపి మీ ముఖానికి అప్లై చేసుకుని కొద్దీ సేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మీ చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఇది ముఖానికి నాచురల్ స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది.మీ ముఖం అందంగా మచ్చలు లేకుండా కాంతివంతంగా మారాలంటే అరటి పండు గుజ్జులో, కొద్దిగా నిమ్మరసం వేసుకుని కలిపి మీ ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేసుకుంటే మీ ముఖహం అందంగా మారుతుంది.

చాలా మంది పొడిబారిన చర్మం వల్ల ఏది వాడాలన్న భయపడుతూ ఉంటారు. అలంటి వారు నిమ్మరసం, తేనే, కొద్దిగా ఉడికించి ముద్దా చేసుకున్న క్యాబేజీ ని బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని 10 నిముషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముఖానికి నిమ్మరసం రాసుకోవడం వల్ల లాభాలు..?

ట్రెండింగ్‌

Advertisement