రుద్రంపూర్, సెప్టెంబర్ 05 : మనుబోతుల కొమురయ్య ఇంటి పేరే యూనియన్ కొమురయ్యగా ప్రసిద్ధి చెందిందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సలిగంటి శ్రీనివాస్ అన్నారు. శనివారం రుద్రంపూర్‌లోని సీపీఐ కార్యాలయంలో కొమురయ్య 30వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ ద్వారా కొమురయ్య చేసిన కార్మిక పోరాటాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని, ఆయన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమానికి సీపీఐ రుద్రంపూర్ కార్యదర్శి, ఉపసర్పంచ్ తోట రాజకుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా నాయకులు వీరస్వామి, సుధాకర్, గట్టయ్య, రామచందర్ పాల్గొన్నారు.