బూర్గంపహాడ్, సెప్టెంబరు 05 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతేపట్టీనగర్కు చెందిన షేక్ జాకీరాబేగం, తన భర్త షేక్ పాషా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో శనివారం బాధితులకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. జాకీరాబేగం అనారోగ్యంతో, పాషా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మేవా కమిటీ బాధ్యులు వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ సంస్థ అండగా నిలుస్తుందని సంస్థ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేవా అధ్యక్షుడు మహ్మద్ ముస్తఫా, ప్రధాన కార్యదర్శి జహీరాబాషా, సోహెల్పాషా, తాజుద్దీన్ పాల్గొన్నారు.