BRS | ఇంద్రవెల్లిలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఇన్చార్జి
BRS | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ( Indravelli ) మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ( Bhukya Johnson Nayak ) గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు.

బీఆర్ఎస్లో చేరిన వారిలో కైలాస్‌నగర్ గ్రామ ఉపసర్పంచ్, దేవాపూర్ గ్రామ ఉపసర్పంచ్, సమాక గ్రామ ఉపసర్పంచ్, ఇంద్రవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముండే వినాయక్ రావు ఉన్నారు. ఇంద్రవెల్లి మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కరాలే శశికళ , వాగ్మారే అనసూయ ఆకాష్, కుమార చిన్నుభాయి , మారుతి , సోయం కవిత మాధవ్ , కాంబ్లే అనసూయ సునీల్‌తో పాటు ఇంద్రవెల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వం, ప్రజా సమస్యలపై స్పందించే తీరు, బీఆర్ఎస్ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం పట్ల పార్టీ నిబద్ధతకు ఆకర్షితులై పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఇంద్రవెల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామస్థాయిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

