e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News మేక‌ప్‌తో నిద్ర‌పోతున్నారా.. స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్న‌ట్టే..!

మేక‌ప్‌తో నిద్ర‌పోతున్నారా.. స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్న‌ట్టే..!

మేక‌ప్‌తో నిద్ర‌పోతున్నారా.. స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్న‌ట్టే..!


హైదారాబాద్‌: ఏదైనా శుభ‌కార్యానికి వెళ్లాలంటే మ‌గ‌వాళ్ల‌కు ష‌ర్ట్, ప్యాంట్ వేసుకుంటే స‌రిపోతుంది. కానీ ఆడ‌వాళ్ల అలంక‌ర‌ణ అంత ఈజీగా పూర్తికాదు. వాళ్లు డ్రెస్సింగ్‌తోపాటు కేశాలంక‌ర‌ణ చేసుకోవాలి. ముఖానికి ఫౌడ‌ర్లు వేయాలి. క‌ళ్ల‌కు ఐ లైన‌ర్ రాయాలి. పెదాల‌కు లిప్‌స్టిక్ పెట్టాలి. అందుకు ఎంత స‌మ‌యం ప‌ట్టినా స‌రే ఓపిగ్గా మేక‌ప్ అవుతారు ఆడ‌వాళ్లు. కానీ ఫంక్ష‌న్ నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత వాటిని తీసేయ‌డంలో మాత్రం చాలామంది బ‌ద్ద‌కిస్తారు. మేక‌ప్ అలాగే ఉంచుకుని నిద్ర‌పోతారు. కానీ దీనివ‌ల్ల చిన్న‌చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇంత‌కు ఆ స‌మ‌స్య‌లు ఏమిటో మ‌నం కూడా తెలుసుకుందామా..?

క‌ళ్లు అందంగా క‌నిపించ‌డం కోసం ఐలైనర్‌, మస్కారా లాంటి వాటిని రాసుకుంటాం. అవి కళ్ల అందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాత్రి ప‌డుకునే ముందు వాటిని తీసేయ‌క‌పోతే కళ్ల నుంచి నీరు కారడం, క‌ళ్లు ఎర్రగా మారడం, కంటి దుర‌ద‌ వంటి సమస్యలు వ‌స్తాయి. అందుకే పడుకునే ముందు ఐ మేకప్‌ను రిమూవర్‌తో తుడిచేయాల‌ని, కళ్లను శుభ్రంగా చన్నీళ్లతో కడిగేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మేక‌ప్‌తో నిద్ర‌పోతున్నారా.. స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్న‌ట్టే..!

ఇక ముఖంపై ఉన్న మేకప్‌ని తొలగించుకోకుండా ఎక్కువ సేపు ఉంచ‌డంవ‌ల్ల అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మేక‌ప్‌ను వ‌దిలేయ‌డంవ‌ల్ల చ‌ర్మం పొడిబారి పోతుంద‌ని, వ్యర్థాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోతాయని అంటున్నారు. దాంతో వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత రావాల్సిన ముడుత‌లు ముందే వ‌స్తాయంటున్నారు. కాబ‌ట్టి ప‌డుకునే ముందు రిమూవర్‌తో మేక‌ప్‌ను తొలగించుకోవ‌డం ఉత్త‌మం.

అదేవిధంగా పెదాల‌కు పెట్టుకునే లిప్‌స్టిక్‌ను కూడా ప‌డుకునే ముందు తీసివేయ‌క‌పోతే స‌మ‌స్య‌లే అంటున్నారు నిపుణులు. లిప్‌స్టిక్‌ను ఎక్కువ‌సేపు తొల‌గించ‌కుండా వ‌దిలేస్తే అది పెదాలపై ఉండే తేమను పీల్చుకుంటుంద‌ట‌. దాంతో పెదాలు పొడిబారిపోయి ప‌గుళ్లు వ‌స్తాయ‌ట‌. ఈ ప‌గుళ్లు తీవ్రంగా వేధిస్తాయి కాబ‌ట్టి ప‌డుకునే ముందు లిప్‌స్టిక్‌ను తీసేయ‌డ‌మే మేలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

గొర్రెకు పిల్లి మ‌సాజ్‌..వీడియో వైర‌ల్‌

అక్క‌డ మే 12 నుంచి సంపూర్ణ‌ లాక్‌డౌన్‌..!

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఆర్బీఐ కీల‌క వ్యాఖ్య‌లు..!

హ్యాట్రిక్‌.. బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం

ఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జ‌రిగింది?

ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ నిషేధం.. సొంత ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్‌

రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేక‌ప్‌తో నిద్ర‌పోతున్నారా.. స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్న‌ట్టే..!

ట్రెండింగ్‌

Advertisement