Lord Ganesha | గణపతి పూజలో భాగంగా గుంజిళ్లు తీస్తారు. ఎందుకు? గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయిస్తాడు. ఆయన విద్యలకెల్ల ఒజ్జ. స్వామి బుద్ధిశక్తిని అనుగ్రహ రూపంలో పొందడం కోసం ఆయన ముందు మనమిలా ప్రవర్తిస్తాం. దీనికి సంబంధించిన పౌరాణిక గాథ ఒకటి ఉంది.
ఒకసారి శ్రీమహావిష్ణువు కైలాసానికి వచ్చాడట. బాలగణపతి ఆటలాడుకుంటూ విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని గుటుక్కున మింగేశాడట. అప్పుడు శ్రీహరి నాలుగు చేతుల్తో రెండుచెవులూ పట్టుకుని గణపతి ముందు గుంజిళ్లు తీశాడు. మేనమామను చూస్తే గణపతికి విపరీతమైన నవ్వొచ్చింది. ఆ నవ్వుతోపాటే సుదర్శన చక్రం కూడా బయటకు వచ్చింది. గుంజిళ్లు తీయడం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
– శ్రీ