Broken Heart Plant | బ్రోకెన్ హార్ట్.. పేరు వింతగా ఉంది కదూ! ఈ మొక్క శాస్త్రీయనామం మాన్స్టెరా అడాన్సోని ( Monstera adansonii ). ఆకులు హృదయాకృతిలో మనీప్లాంట్ మొక్కను గుర్తుచేస్తాయి. కానీ, మధ్యలో కళాత్మకంగా కత్తిరించినట్టు రంధ్రాలు ఉంటాయి. అందుకే ‘బ్రోకెన్ హార్ట్ ప్లాంట్’ అని పిలుస్తారు.
వీటిని ఇంట్లో, కాస్త నీడ ఉండే బాల్కనీలో పెంచుకోవచ్చు. పూర్తి ఆకుపచ్చ, తెలుపు-ఆకుపచ్చ కలగలిసిన ఆకులతోనూ దొరుకుతాయి. నీళ్లలోనూ, మట్టిలోనూ పెరుగుతాయి. హ్యాంగింగ్ ప్లాంటర్స్లోనూ, ఏదైనా ఎత్తు మీద ఉండే కుండీల్లో పెడితే ముచ్చటగా వేలాడుతుంటాయి. కాస్త పెద్ద నర్సరీలతో పాటు ఆన్లైన్లోనూ ఈ మొక్కలు దొరుకుతున్నాయి.
“Dolphin Plant | డాల్ఫిన్లు చెట్ల మీద ఉండటం ఎప్పుడైనా చూశారా?”