ఇటానగర్, జూన్ 5: అత్యంత అరుదైన ‘లిప్‌స్టిక్’ మొక్కను బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(బీఎస్ఐ) పరిశోధకులు అరుణాచల్‌ప్రదేశ్‌లో గుర్తించారు. అంజా జిల్లాలో కిందటేడాది డిసెంబర్లో ఇది కనిపించింది. ఈ వివరాలను తాజాగా కరెంట్ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.
లిప్‌స్టిక్ మొక్క శాస్త్రీయ నామం ఏస్కీనాంథస్ మానటేరియా డ్యూన్. దీని పువ్వులు లిప్‌స్టిక్‌లాగా గులాబీ రంగులో ఉంటాయి. దీన్ని మొట్టమొదటిసారిగా 1912లో బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ డ్యూన్ అరుణాచల్‌ప్రదేశ్‌లోనే దీన్ని కనుగొన్నారు. ఈ మొక్క మళ్లీ వందేండ్ల తర్వాత కనిపించడం విశేషం. లిప్‌స్టిక్ మొక్క ఐయూసీఎన్ అంతరించి పోతున్న మొక్కజాతుల్లో ఉన్నది.