Money Plant |మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనట
Money Plant | మనీ మీద మమకారంతో ఇంట్లో, ఆఫీస్‌లో మనీప్లాంట్ పెంచుకుంటారు చాలామంది. మొక్క పెరిగేకొద్దీ సంపదలూ పెరుగుతాయని ఓ నమ్మకం. అయితే, ఈ కాసుల మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెంచడం అశుభమని హెచ్చరిస్తారు వాస్తు నిపుణులు.
ఈశాన్యం వద్దు
సాధారణంగా దైవానికి సంబంధించినది ఏదైనా ఈశాన్య దిశలో ఉంచడానికి ప్రయత్నిస్తాం. అయితే, మనీ ప్లాంట్‌ను మాత్రం ఈశాన్యంలో పెంచకూడదు. ఇంటికి ఈశాన్యం మూలలో మనీప్లాంట్ నాటితే, రుణాత్మక శక్తి పెరిగిపోయి ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెడతాయని హెచ్చరిస్తారు నిపుణులు. అదే ఆగ్నేయ దిశలో పెంచితే కుజ, శుక్ర గ్రహాల అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. రుణబాధలూ తగ్గుతాయంటారు.
తీగ పందిరి ఎక్కితే
మనీప్లాంట్ తీగ గృహానికి కొత్త శోభ తీసుకొస్తుంది. గ్రౌండ్‌ఫ్లోర్ ఇంట్లో అయినా మనీప్లాంట్‌ను నేలలో కాకుండా, కుండీలోగానీ, నీళ్ల సీసాలోగానీ పెంచడం మంచిది. అలాగే, తీగను నేలపై పాకించకుండా, పందిరి ఎక్కించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పురోగతి బాగుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మొక్కను వాకిట్లోనో, పెరట్లోనో కాకుండా ఇంట్లో కానీ, బాల్కనీలో కానీ పెంచుకోవడం మంచిది.
ఎవరికీ ఇవ్వొద్దు
మనీప్లాంట్‌ను నర్సరీ నుంచి కొని తెచ్చుకోవాలి. అంతేకానీ ఎవరినుంచీ ఉచితంగా తీసుకోవడం గానీ, ఇతరులకు ఇవ్వడం గానీ మంచిది కాదంటారు. దీనివల్ల ఇచ్చేవారి అదృష్టం, తీసుకునేవారికి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. అటూ ఇటూ అయినా కావచ్చు.
Read More :
“వందేండ్ల తర్వాత కనిపించిన లిప్‌స్టిక్ మొక్క”
Vasthu Shastra | ఇంటికి ఉత్తరంలో టాయిలెట్లు ఉండొద్దా? వాటిని తిప్పి కట్టొచ్చా?
Vasthu Shastra | ఇంటికి ఉత్తరంలో టాయిలెట్లు ఉండొద్దా? వాటిని తిప్పి కట్టొచ్చా?
ఇల్లు కట్టే ప్రదేశంలో ‘కొబ్బరి చెట్టు’ వస్తున్నది. దానిని ఉంచాలా? లేదంటే తీసేసి ఇల్లు కట్టుకోవాలా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

