String of Perals | ఈ వానాకాలం కొత్త మొక్కలేమైనా పెంచాలనుకుంటున్నారా? అయితే ఇది అచ్చంగా మీ కోసమే. ఆకుపచ్చని ముత్యాల సరాలు అందంగా వేలాడుతున్నాయా అన్నట్టు కనిపించే ఈ మొక్క పేరు ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’. ఎడారి జాతికి చెందిన దీని అసలు పేరు ‘సెనెసియో రొలెయనస్’. చిన్నచిన్న ఆకులు ఉండటం వల్ల స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్ అనీ పిలుస్తారు.
ఎలాంటి వాతావరణంలో అయినా సులభంగా బతికేస్తాయి. నీళ్లు ఎక్కువ అవసరం లేదు. గాలీ వెలుతురూ మాత్రం ధారాళంగా కావాలి. ఈ తీగలు మూడు అడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. అంటే కుండీలో పెడితే కిందికి జాలువారుతూ అందంగా కనిపిస్తాయన్నమాట. సీలింగ్‌కు, కిటికీలపైన, గుమ్మం ముందు, బాల్కనీలో పెంచుకోవడానికి బాగుంటాయి. హ్యాంగింగ్ ప్లాంటర్లకు పర్ఫెక్ట్ మ్యాచ్.
“Money Plant |మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనట”