తూర్పుదిక్కున ఉయ్యాలో.. తులసి వాన కురిసె ఉయ్యాలో..
పడమటి దిక్కున ఉయ్యాలో.. పాలవాన కురిసె ఉయ్యాలో..
ఆ వాన ఈ వాన ఉయ్యాలో.. చెరువు నిండిపాయే ఉయ్యాలో..
చెరువు నిండిపాయె ఉయ్యాలో.. కట్ట దెగిపాయే ఉయ్యాలో..
కట్టమీది మైసమ్మ ఉయ్యాలో.. ఏమని వరమడిగె ఉయ్యాలో..
నీ పెద్ద కొడుకును ఉయ్యాలో.. ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
పెద్దకొడుకునిస్తె ఉయ్యాలో.. పేరుకెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ నడిపి కొడుకును ఉయ్యాలో.. ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
నడిపి కొడుకునిస్తె ఉయ్యాలో.. నడకకెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ చిన్న కొడుకును ఉయ్యాలో.. ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
చిన్నకొడుకునిస్తె ఉయ్యాలో.. చిలిపికెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ పెద్ద కోడల్ని ఉయ్యాలో.. ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
పెద్ద కోడల్నిస్తె ఉయ్యాలో.. ఇంటి బాధ్యతలెట్ల ఉయ్యాలో..
నీ నడిపి కోడల్ని ఉయ్యాలో.. ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
నడిపి కోడల్నిస్తె ఉయ్యాలో.. నారుమడులెట్ల ఉయ్యాలో..
నీ చిన్న కోడలి ఉయ్యాలో.. ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
చిన్న కోడల్నిస్తె ఉయ్యాలో.. ఇంటి పనులెట్ల ఉయ్యాలో..