ఆకలేస్తోందని అర్ధరాత్రి ఏది పడితే అది తినేస్తున్నారా.. ఈ ఫుడ్ ట్రై చేయండి
Late Night Food | చాలామందికి అర్ధరాత్రిళ్లు బాగా ఆకలేస్తుంటుంది. కొంతమంది బలవంతంగా కండ్లు మూసుకొని పడుకుంటారు. ఇంకొంతమంది వంటింటి బాటపట్టి.. ఏది ఉంటే అది తింటుంటారు. అర్ధరాత్రి ఆకలి బాధ అణచుకునేందుకు రాత్రి తినేటప్పుడే అతిగా తింటుంటారు మరికొందరు. ఇలా ప్రతిరోజూ చేస్తే ఊబకాయాన్ని ఆహ్వానించినట్లే అంటున్నారు పోషకాహార నిపుణులు.
రాత్రిళ్లు అతిగా తినడం వల్ల జీవక్రియ లోపిస్తుంది. బొడ్డుచుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. దాంతో ఊబకాయులుగా మారిపోతారు. మరి ఆకలిని ఎలా తట్టుకోవాలి? అంటే.. రాత్రిళ్లు స్లీప్ శాండ్విచ్ ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. దీనికోసం అరటిపండు, మార్మైట్, పాలకూరను సూచిస్తున్నారు. బ్రెడ్‌కు మార్మైట్ రాసి, అరటిపండు, పాలకూరను కలిపి తింటే ఆకలి తీరడంతోపాటు సుఖనిద్ర వస్తుందని అంటున్నారు. అరటిలోని మెగ్నీషియం, పొటాషియం కండరాలను సడలించడంలో సహాయపడతాయి. అలా నరాల వ్యవస్థ ఉపశమనం పొందుతుంది. ఈ ప్యాక్‌లో ఉండే ట్రిప్టోఫాన్ మెదడును శాంతపరిచే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కాగా, మార్మైట్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నిద్ర త్వరగా వస్తుందట.
Read More :
buffet | బఫేలో ఏం తినాలి? ఎలాంటి టిప్స్ పాటిస్తే మంచిది?”
Thyroid | థైరాయిడ్ సమస్య రావొద్దంటే ఇవి ట్రై చేయండి”
“Health Tips | ఈ ఆహారంతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్!”
“Health Tips | మూడ్ బాలేదంటే ఈ ఫుడ్‌ను పక్కనపెట్టాల్సిందే!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Food
- Health
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

