Thyroid | థైరాయిడ్ సమస్య రావొద్దంటే ఇవి ట్రై చేయండి
Thyroid | మన శరీరంలో మెడ కింది భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి.. థైరాయిడ్. మన జీవక్రియలు సక్రమంగా సాగడంలో ఈ గ్రంథి పాత్ర కీలకం. కాబట్టి, థైరాయిడ్‌ను ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రయత్నంలో ఉపకరించే ఆహార పదార్థాలు ఇవి..

కొబ్బరి
థైరాయిడ్ రోగులకు కొబ్బరి ఉత్తమ ఆహారం. పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, కొబ్బరినూనె.. ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. కొబ్బరి మందకొడిగా సాగే జీవక్రియను వేగిర పరుస్తుంది. ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు (ఎంసీఎఫ్ఏ), మీడియం చైన్ ట్రై గ్లిజరైడ్స్ (ఎంటీసీ) పుష్కలం. ఇవన్నీ జీవక్రియకు సహకరిస్తాయి.

గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. శరీరం విటమిన్లు, మినరల్స్‌ను గ్రహించడంలో జింక్ కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోనును సమన్వయం చేయడంలో, సమతూకంలో ఉంచడంలో సహాయకారిగా ఉంటుంది.

ఉసిరి
నారింజ పండుతో పోలిస్తే ఎనిమిది రెట్లు, దానిమ్మతో పోలిస్తే పదిహేడు రెట్లు విటమిన్-సి లభిస్తుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి ఉసిరి గొప్ప ఉపకారి. వెంట్రుకలకు మంచి టానిక్ కూడా.
బ్రెజిల్ నట్స్
థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా పనిచేయాలంటే సెలీనియం అనే సూక్ష్మపోషకం అవసరం. సెలీనియానికి బ్రెజిల్ నట్స్ సహజ వనరులు. రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే యాంటీ ఆక్సిడెంట్స్, థైరాయిడ్ మినరల్స్ లభిస్తాయి.

పెసర్లు
అన్నిరకాల బీన్స్ కూడా ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌కు గనులు. వీటిలో ఫైబర్ శాతమూ ఎక్కువే. దీంతో థైరాయిడ్ అసమతుల్యత వల్ల తలెత్తే మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది. పెసర్లు అయోడిన్‌ను కూడా అందిస్తాయి. సులువుగా అరిగిపోతాయి.
Read More :
“థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?”
ఆ’గర్భ’ శత్రువు!.. థైరాయిడ్ లోపాలు తల్లీ బిడ్డలకు ప్రమాదమే”
Simhasanam in Yoga | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

